- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ స్థానాలకు గాంధీ కుటుంబం వీలునామా : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని కొన్నిలోక్‌సభ స్థానాలకు గాంధీ కుటుంబం వీలునామా రాసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు. రాయ్‌బరేలీ సీటును గాంధీ కుటుంబం తమ కుటుంబ ఆస్తిగా భావిస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. ‘‘కుమారుడిని రాయ్‌బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నానని సోనియాగాంధీ అనడం.. ఇది నా తల్లి సీటు అని రాహుల్‌గాంధీ చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. అది కుటుంబ ఆస్తి కాదు కదా ?’’ అని మోడీ ప్రశ్నించారు. ‘‘రాయ్‌బరేలీలో పోటీకి నిలపడానికి కాంగ్రెస్ పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడుతున్న ఒక్క సీనియర్ నాయకుడు కూడా దొరకలేదా ?’’ అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కుటుంబ పార్టీల నుంచి జార్ఖండ్‌ను కాపాడాలని ఓటర్లకు ప్రధాని పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘నా మేనల్లుళ్ల కోసం ఏమీ చేయక్కర్లేదు’
‘‘మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజకీయంగా చాలా చేయాల్సి ఉంటుంది. కానీ నేను నా మేనల్లుళ్ల కోసం అలాంటివేం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాది కుటుంబ రాజకీయ పార్టీ కాదు’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ‘‘నేను ఏదైనా చేయాల్సి ఉందంటే అది దేశ ప్రజల కోసమే. బంకురా అడవుల్లో నివసించే ప్రజల కోసం నేను పని చేయాలి. మూడోసారి మీ ఆశీర్వాదం కోసం వచ్చాను’’ అని తెలిపారు. బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ఈ కామెంట్స్ చేశారు.
‘టాండన్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే నెహ్రూ అడ్డుకున్నారు’
‘‘కాంగ్రెస్ పార్టీని నడుపుతున్న వాళ్లు రాజ్యాంగాన్ని అంగీకరించరు. వాళ్లకు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడే అర్హత లేదు. 1950 సంవత్సరంలో పురుషోత్తమ్ దాస్ టాండన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ అందుకు జవహర్‌లాల్ నెహ్రూజీ సహకరించలేదు. పురుషోత్తమ్ దాస్ టాండన్ పార్టీ అధ్యక్షుడైతే తాను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో ఉండబోనని స్పష్టం చేశారు. దీంతో గాంధీ కుటుంబాన్ని సంతోషపరిచేందుకు పద్ధతి ప్రకారం ఎన్నికైన టాండన్‌ను అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టారు’’ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవివరాలను ప్రధాని తెలిపారు.