- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్రలో హీనుడిగా మిగిలిపోదలుచుకోలేదు.. మేనిఫెస్టో విడుదల వేళ జగన్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో నేడు(ఏప్రిల్ 27) సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమని జగన్ అన్నారు. ఈ ఐదేళ్లలో మేనిఫెస్టోకే గౌరవం వచ్చిందని వెల్లడించారు. 2019 మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశామంటున్నారు. మొదటి ఏడాదిలోనే 88 శాతం అమలు చేశామన్నారు. 2019 మే అంశాలను నిష్టతతో అమలు చేశామని తెలిపారు. నేరుగా సొంత ఖాతాల్లో డబ్బులు పంపిణీ చేశామని చెప్పారు. ఈ మేనిఫెస్టో ప్రతి ప్రభుత్వ అధికారి దగ్గర ఉందన్నారు. రూ. 2. 70 లక్షల కోట్లు లబ్ధిదారులకు పంచామని పేర్కొన్నారు. దేశచరిత్రలో ఈ 58 నెలలు చిరస్థాయిగా నిలిచిపోతాయని జగన్ గొంతెత్తి చెప్పారు. పథకాలకు క్యాలండర్ విడుదల చేసిన చరిత్ర లేదన్నారు. చరిత్రలో హీనుడిగా మిగలదలుచుకోలేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకుని హీరోగా ఉండాలనుకున్నానని జగన్ వెల్లడించారు. పాద యాత్రలో పేదల కష్టాలు కళ్లారా చూశానన్నారు. ప్రతి ఇంటి బాధ నా బాధే అన్నారు.