- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జియో సేవలపై స్టార్ హీరోయిన్ ఫైర్.. అత్యంత దుర్భరంగా ఉన్నాయంటూ సంచలన పోస్ట్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ ఖుష్భు సుందర్ అందరికీ సుపరిచితమే. ఆమె ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె బీజేపీ పార్టీలో ఉంది. ఖుష్భు మహిళా కమిషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. అమ్మాయిలపై జరిగే అన్యాయాలు, అక్రమాలపై పలు పోస్టులు షేర్ చేస్తుంది. అలాగే రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. సినిమాల్లోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఆమె నటించిన సినిమా రామబాణం.
ఇందులో గోపీచంద్ హీరోగా నటించాడు. అయితే ఈ మూవీ గత ఏడాది విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఖుష్భు హైదరాబాద్ జియో సేవలపై ఫైర్ అవుతూ ఓ పోస్ట్ పెట్టింది. ‘‘హలో జియో కేర్ హైదరాబాద్‌లో మీ కస్టమర్ కేర్ అత్యంత దుర్భలంగా ఉన్నాయి. వారు లేవనెత్తిన ఫిర్యాదుల ఫిర్యాదు చేసి 24 గంటల కంటే ఎక్కువ సమయం గడిచింది. కానీ కస్టమర్ కేర్ సెంటర్ నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఇలాంటిది ఎక్కడా చూడలేదు. వారు లేవనెత్తిన ఫిర్యాదుల గురించి క్లూలెస్‌గా ఉన్నారు. చేయబోయే సేవ వాగ్దానాన్ని గౌరవించరు.
ఇలాంటిది నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు మీ కస్టమర్ కేర్ సేవ వైఫల్యానికి వ్యతిరేకంగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వాల్సి ఉంది. Jio నుండి నేను కొంచెం మెరుగైన సేవలు అందుతాయని ఆశిస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఇదంతా మీ బాస్ మోడీ వల్లేనని ఖుష్బుకు కౌంటర్లు వేస్తున్నారు.