మహేష్ బాబు, నమ్రతల ప్రేమను కృష్ణ అంగీకరించకపోవడానికి కారణం ఇదే..!

by Anjali |   ( Updated:2023-08-07 12:06:13.0  )
మహేష్ బాబు, నమ్రతల ప్రేమను కృష్ణ అంగీకరించకపోవడానికి కారణం ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబుకు ఇండస్ట్రీలో ఎంతగా క్రేజ్ ఉందో చెప్పుకోనవసరం లేదు. సీనియర్ హీరో కృష్ణ వారసుడిగా పరిచయమయినప్పటికీ.. చాలా తక్కువ టైంలో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక, వంశీ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్‌గా నమ్రత నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు.

5 ఏళ్ల తర్వాత మహేష్ వీరి లవ్ విషయం ఇంట్లో చెప్పారట. మహేష్ తండ్రి కృష్ణ.. మొదట్లో వీళ్ళ ప్రేమను అంగీకరించలేదట. దీనికి కారణం.. ఒక తెలుగు అమ్మాయితో సూపర్ స్టార్ పెళ్లి చేద్దామని ఆయన నిర్ణయించుకున్నాడట. కానీ, మహేష్ తల్లి కృష్ణను ఒప్పించారట. వీరి లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచే మహేష్ అక్క మంజుల వీరికి మంచి సపోర్ట్ ఇచ్చారట. వీరి పెళ్లి జరగడంలో ఆమె కీలక పాత్ర పోషించిందట.

Read More: ఆ కారణంతోనే తమన్న ‘భోళా శంకర్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదట!

Advertisement

Next Story