అదిరిపోయిన BIG BOSS-6 టీజర్.. ఆ రోజు నుంచే ప్రారంభం

by sudharani |   ( Updated:2023-10-12 07:24:15.0  )
అదిరిపోయిన BIG BOSS-6 టీజర్.. ఆ రోజు నుంచే ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: అతి తక్కువ కాలంలోనే బుల్లితెరపై అద్భుతమైన పాపులారిటీ సంపాదించుకున్న షోలలో బిగ్‌బాస్ షో ముందంజలో ఉంటుంది. ఇప్పటికే ఐదు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఆరో సీజన్‌కు ముస్తాబయింది. ఇప్పటికే బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చే కంటెస్టంట్లను కూడా క్వారంటైన్‌కి తరలించారు. ఈ సారి హౌస్ లోకి మొత్తం 19 మంది వెళ్లనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సారి బిగ్‌బాస్ ఇంటిని గత సీజన్లకు భిన్నంగా.. మరింత అందంగా తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన ఫస్ట్ గింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ గింప్స్‌లో ''లైఫ్‌లో ఏ మూ‌మెంట్ అయినా బిగ్‌బాస్ తర్వాతే అని నాగార్జున ఎంట్రీతో ప్రారంభం అయింది. అంతేకాకుండా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎంట్రీని, వారు చేసిన ఫెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన కొన్ని విజువల్స్‌ను కూడా చూపించారు. కాగా బిగ్‌బాస్ 6 సెప్టెంబర్ 4న అనగా ఈ ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

Advertisement

Next Story