శృతిహాసన్‌ను ఆ ప్రశ్నలు అడిగిన నెటిజన్స్.. ప్లీజ్ అంటూ వేడుకున్న హీరోయిన్

by Jakkula Samataha |   ( Updated:2024-07-05 09:04:13.0  )
శృతిహాసన్‌ను ఆ ప్రశ్నలు అడిగిన నెటిజన్స్.. ప్లీజ్ అంటూ వేడుకున్న హీరోయిన్
X

దిశ, సినిమా : హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈముద్దుగుమ్మ తర్వాత ఓ మైఫ్రెండ్, గబ్బర్ సింగ్, బలుపు,రేసుగుర్రం, ఆగడు, శ్రీమంతుడు లాంటి చాలా సినిమాల్లో నటించి మంచి హిట్ అందుకుంది. ఇక ఎప్పుడూ ఈ ముద్దుగమ్మ కు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియలో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా తాను ఈ మధ్య తన లవర్ శాంతన్ హజరికాతో బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన అనేక వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక శృతిహాసన్ ఎప్పుడూసోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన అభిమానులతో ఆస్క్ మీ ఎనిథింగ్ పేరుతో చిట్ చాట్ సెషన్‌లో పాల్గొంది. ఈక్రమంలో కొందరు ఆమెను పలు రకాల ప్రశ్నలు అడిగారు. అందులో ఓ నెటిజన్ ప్రేమకు అర్థం చెప్పమని కోరితే, మరో నెటిజన్ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగారు. ఇంకో వ్యక్తి మీకు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉందని అడిగారు. దీంతో వారి ప్రశ్నలకు ఖంగుతున్న బ్యూటీ దయచేసి అమ్మాయిలను ఇలాంటి ప్రశ్నలు అడగడం మానేయండి, ఇవి చాలా సిల్లీగా అనిపిస్తున్నాయి, ప్లీస్ అమ్మాయిలకు ఏవి సంతోషాన్ని ఇస్తాయో ఆ పనులు చేసుకోనివ్వండి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.దీంతో తన ఫ్యాన్స్ పై ఆమె స్పందిచిన తీరు అందరినీ షాక్ గురిచేస్తుంది.

Advertisement

Next Story