నీకు నాకు డేటింగ్ అంటూ తమన్నా పెదవి గిల్లిన చిరు.. (వీడియో)

by sudharani |   ( Updated:2023-07-24 04:16:39.0  )
నీకు నాకు డేటింగ్ అంటూ తమన్నా పెదవి గిల్లిన చిరు.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘భోళా శంకర్’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన భోళా మేనియా, పార్టీ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ క్రమంలోనే థర్ట్ సింగిల్ గురించి అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘‘మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ.. నీకు నాకు డేటింగ్’’ అనే లిరిక్స్‌ను రిలీజ్ చేశారు. ఇక పూర్తి లిరికల్ వీడియోను శుక్రవారం రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించగా.. ఈ ప్రోమోలో మాత్రం చిరంజీవి తమన్నా పెదవి గిల్లడం హైలెట్‌గా మారింది.

Advertisement

Next Story