- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను చనిపోయినట్టు రాశారు.. అలాంటి వార్తలు చూస్తే బాధేస్తుంది సీనియర్ హీరో శ్రీకాంత్!
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలకు తండ్రై కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. అయితే ఇటీవల శ్రీకాంత్, ఊహ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలను ఖండిస్తూ శ్రీకాంత్ అప్పట్లో రియాక్ట్ అయ్యారు. తాజాగా, మార్చి 23న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల వార్తలపై మరోసారి ఆవేదన వ్యక్తం చేశాడు.
శ్రీకాంత్ మాట్లాడుతూ.. కొంత మంది సోషల్ మీడియాను తప్పుగా వాడుతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ వారు వీడియోలకు పెట్టే థంబ్‌నైల్స్ చూస్తుంటే బాధేస్తుంది. నేను చనిపోయినట్టు రాసి నా ఫొటో పెట్టారు. ఊహతో విడాకులు తీసుకుంటున్నట్లు కూడా వార్తలు రాశారు. ఇలాంటివి ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెడతాయి. మొదటి నుంచి నా భార్య ఊహకు ఈవెంట్స్‌లో పాల్గొనడం పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఈ రూమర్స్ రావడం వల్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా తనను వెంట తీసుకుని పోతున్నా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం శ్రీకాంత్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి: స్టార్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం