ఇప్పటికీ నన్ను ఆ విధంగానే చూస్తున్నారు.. శ్రియా శరణ్ ఎమోషనల్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-02-29 08:00:58.0  )
ఇప్పటికీ నన్ను ఆ విధంగానే చూస్తున్నారు.. శ్రియా శరణ్ ఎమోషనల్ కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. కెరీర్ పీక్స్‌లో ఉందనగా.. వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను పెళ్లి చేసుకుని ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే శ్రియా వరుస చిత్రాల్లో నటిస్తూ ఇప్పటికీ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇటీవల కబ్జా మూవీతో ప్రేక్షకులను అలరించింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన భర్త, కూతురితో కలిసి ఎంజాయ్ చేసిన వీడియోలు ఫొటోలు షేర్ చేస్తుంది. ప్రస్తుతం షో టైమ్ వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ఇది ఓటీటీలో మార్చి 8న స్ట్రీమింగ్ కానుంది.

అయితే షో టైమ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా శ్రియా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్, హీరోయిన్లను పనికి మాలిన వారిలా చూస్తారు. అప్పుడు ఇప్పుడు అలాగే చూస్తున్నారు. కొన్నిసార్లు ఫొటోలకు పెట్టే కామెంట్స్ చూసి ఫీల్ అవకుండా ఉండలేం కదా. కానీ ఇప్పుడు నేను ఒక తల్లిని. నాకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అయినా నన్ను అలాగే చూస్తున్నారు. అయితే ఇవన్నీ మర్చిపోయేందుకు నేను పాత ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి వారితో సంతోషంగా గడిపి వస్తాను. ఆ సమయంలో బాధను చూసిన నా భర్త ఎక్కువగా ఆలోచించకు అని నన్ను ఓదారుస్తాడు. అయితే నా భర్త కూతురితో కలిసి నేను బయటకు వెళ్లినప్పుడు కూడా ఏదో ఒకటి అంటుంటారు. అయినా అవన్నీ పట్టించుకోకుండా నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను. నాకు నచ్చినట్టు ఉంటాను. నన్ను ఎలా చూస్తున్నారు అనేది వాళ్ళ సమస్య నాది కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రియా కామెంట్స్ వైరల్ అవుతుండటంతో అది చూసిన వారంతా ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

Advertisement

Next Story