ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకోమన్నారు.. ఈషా రెబ్బా ఎమోషనల్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-05-20 06:32:05.0  )
ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకోమన్నారు.. ఈషా రెబ్బా ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో అందం కోసం పలు సర్జరీలు చేయించుకుని గ్లామర్‌ను పెంచుకుంటారు. అయితే ఎంతో మంది హీరోయిన్లు, హీరోలు రకరకాల సర్జరీలు చేయించుకుని తమ అందాన్ని రెట్టింపు చేసుకుని వరుస ఆఫర్లు కొట్టేస్తారు. అయితే ఒకానొక సమయంలో కొందరు టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బాను కూడా సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారట. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ తన స్కిన్ వల్ల పలు విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలుపుతూ ఎమోషనల్ అయింది. ‘‘ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా మంది నా స్కిన్ కలర్ గురించి మాట్లాడేవారు.

కలర్ తక్కువగా ఉన్నానని చెప్పేవారు. అంతేకాకుండా ఫొటో షూట్ చేసినప్పుడు ఎంత నల్లగా ఉన్నావో చూడు కొంచెం తెల్లగా ఉంటే బాగుండేది అన్నారు. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కలర్ ఎక్కువగా ఉండాలి కాబట్టి నువ్వు క్రీములు వాడు లేదా ఏదైనా ట్రీట్‌మెంట్ తీసకోమని చెప్పారు. దీంతో నా కలర్ పనికిరాదా అని బాధపడేదాన్ని. నేను యాడ్ చేసి పెయింట్ కొట్టినట్టుగా తెల్లగా మేకప్ వేసేసరికి చాలా ఇబ్బంది పడ్డాను.

కొందరైతే నోస్ సర్జరీ చేయించుకోమని అన్నారు. అప్పటి వరకు నాకు అసలు ఇలా సర్జరీలు చేయింకుంటారనే విషయం తెలియకపోవడంతో.. వాళ్లు అలా మాట్లాడుతుంటే ఫీలయ్యే దాన్ని. కానీ ఇండస్ట్రీకి వచ్చాక నీ కలర్ బాగుందని అదే నీకు అదృష్టం అని అన్నారు. అప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆడిషన్‌కు పిలిచిమరీ ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా అవకాశం ఇచ్చారు. అప్పుడే డిసైడ్ అయ్యాను. ఎలాగైనా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగాలని నా కోరిక నెరవేరింది’’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed