Radhika: మా పరువు బజారుకీడుస్తున్నారు.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. సీనియర్ నటి సంచలన కామెంట్స్

by Kavitha |
Radhika: మా పరువు బజారుకీడుస్తున్నారు.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. సీనియర్ నటి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అంతే కాకుంగా తనకంటూ సపరేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. గత కొద్ది కాలంగా ఆమె తల్లి, అత్త పాత్రలు చేస్తూ ఇప్పటికీ మెప్పిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్న యూట్యూబ్‌ చానెళ్ళ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి, సినీ నటుడు ఉదయనిధికి సీనియర్ హీరోయిన్ రాధిక శ‌ర‌త్ కుమార్ కోరారు. ఈ విషయంలో సెలబ్రిటీలు కూడా చొరవ తీసుకుని తమ పరువు బజారుకీడ్చుతున్న యూట్యూబ్‌ చానెల్స్‌ యజమానులపై పరువు నష్టం దావా వేయాలని ఆమె సూచించారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు తెలుగులో సుమారుగా 18 యూట్యూబ్‌ చానెళ్లపై చర్యలు తీసుకున్నారు. అందుకు అతన్నిచూసి గ‌ర్విస్తున్నాన‌ని తెలిపారు..

ఈ క్రమంలో.. ‘నడిగర్‌ సంఘం కూడా మేల్కోవాలి. జర్నలిస్టులుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు చాలా మంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అదేపనిగా అసత్య కథనాలను ప్రసారం చేస్తున్నారు. ఇలాంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి ఉదయనిధి‌తో పాటు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని.. నూత‌న చ‌ట్టాలు తీసుకురావాల‌న్నారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ కూడా ఏకం కావాలి’ అని సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ కోరారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story