పెళ్లైన హీరోలను ప్రేమించిన అగ్ర హీరోయిన్లు వీళ్లే.. పైగా సహజీవం కూడా చేసి!

by Anjali |   ( Updated:2023-09-12 08:58:33.0  )
పెళ్లైన హీరోలను ప్రేమించిన అగ్ర హీరోయిన్లు వీళ్లే.. పైగా సహజీవం కూడా చేసి!
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు పెళ్లైన హీరోలను ప్రేమించి.. వారితో సహజీవనం కూడా చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ సృష్టిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఆల్రెడీ పెళ్లైన హీరోలను కొందరు అగ్ర హీరోయిన్లు ప్రేమించారని టాక్ వినిపిస్తుంది. ‘హీరోయిన్ ఛార్మి కౌర్ రమ్యకృష్ణ భర్త డైరెక్టర్ కృష్ణవంశీతో ప్రేమలో ఉందని, ఈ కారణంగానే రమ్యకృష్ణ కృష్ణవంశీ మధ్య గొడవలు జరిగాయని నెట్టింట వార్తలు వచ్చాయి. అలాగే పూరి జగన్నాథ్‌తో కూడా ఈ అమ్మడు ఎఫైర్ పెట్టుకుందట. అనుష్క శెట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో నాగార్జునపై మోజు పడిందట. అలాగే నయనతార.. ప్రభుదేవాతో డేటింగ్‌లో ఉందంటూ జోరుగా వార్తలు వినిపించాయి.

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కుమార్తె.. శృతి హాసన్ పెళ్లైన హీరో ధనుష్‌తో రిలేషన్‌ పెట్టుకుందట. మహానటి సావిత్రి బయోపిక్‌‌లో నటించి టాలీవుడ్ మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ కూడా పెళ్లైన కోలీవుడ్ హీరో విజయ్‌తో ప్రేమాయణం నడిపిందని నెట్టింట చాలానే వార్తలు వినిపించాయి. త్వరలోనే విజయ్ తన భార్య సంగీతకు డివోర్స్ ఇచ్చి కీర్తిని రెండో పెళ్లి చేసుకుంటారని నెట్టింట ప్రచారం జరిగింది. ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి : Vishal అంటే నాకు చాలా ఇష్టం.. మనసులో మాట బయటపెట్టిన హీరోయిన్

Advertisement

Next Story