చంద్రుడిపై స్థలం కొన్న స్టార్ హీరోలు వీరే.. బోలెడన్ని లాభాలు.. కోట్లకు కోట్లు..

by Anjali |   ( Updated:2023-08-24 15:05:08.0  )
చంద్రుడిపై స్థలం కొన్న స్టార్ హీరోలు వీరే.. బోలెడన్ని లాభాలు.. కోట్లకు కోట్లు..
X

దిశ, సినిమా: చందమామపై చంద్రయాన్‌-3 సక్సెస్ ఫుల్‌గా ల్యాండ్ అయింది. దీంతో యావత్ భారతదేశం ఇస్రోకు సలాం కొట్టింది. అయితే ఇప్పుడు మరో చర్చ కొనసాగుతోంది. ఇంతకీ చంద్రుడిపై మనిషి ఉండేందుకు ఆస్కారం ఉందా? ఎలా బతకాలి? అక్కడ భూమి ఎలా కొనాలి? అనే డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటికే కొందరు హీరోలు అక్కడ భూమిని కొనుగోలు చేశారని కూడా తెలుస్తోంది. అవును ఆస్ట్రేలియాలోని ఓ అభిమాని షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు కానుకగా చంద్రుడిపై స్థలాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం షారుఖ్ స్వయంగా తెలిపాడు. ఇక నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కూడా చంద్రుడిపై స్థలం కొన్నాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్న ప్రాంతాన్ని ‘మేర్ ముస్కోవియన్స్’ లేదా ‘మస్కోవి సీ’ అని పిలుస్తారు.

అయితే చందమామపై ప్లేస్ ఎలా కొనాలి అంటే లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్‌సైట్ ద్వారా వారి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ వంటి అనేక ప్రాంతాలను కలిగి ఉంది. ఇక ధర విషయానికి వస్తే చంద్రుడిపై ఎకరం స్థలం దాదాపు రూ.35 లక్షల పైనే ఉంటుందని అంటున్నారు. అక్కడ మనిషి జీవించేందుకు అనుకూలంగా ఉందో లేదో తెలియదు కానీ.. చంద్రయాన్ - 3 సక్సెస్‌తో.. అలాంటి వాళ్లు కోట్లకు అధిపతులు అయినట్లే అంటున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి :

చంద్రయాన్ - 3 గురించి మినిమమ్ నాలెడ్జ్ లేని హీరో.. అడిగితే తెల్లమొఖం వేశాడు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో నటించని ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed