OTT : అదిరిపోయే న్యూస్.. ఆగస్టులో ఓటీటీలోకి రానున్న ఐదు సూపర్ మూవీస్ ఇవే!

by Jakkula Samataha |
OTT : అదిరిపోయే న్యూస్.. ఆగస్టులో ఓటీటీలోకి రానున్న ఐదు సూపర్ మూవీస్ ఇవే!
X

దిశ, సినిమా : ఆగస్టు నెల ఓటీటీ ప్రియులకు తీపి కబురు తీసుకొస్తుంది. ఈ నెలలో ఏకంగా ఐదు సూపర్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా త్వర త్వరగా సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. కాగా, ఈ ఆగస్టు నెలలో ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

భారతీయుడు : భారతీయుడు 2 సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. కాగా, ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీని ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.

డార్లింగ్ : నభా నటేష్, ప్రియదర్శి హీరో హీరోయిన్లుగా నటించిన డార్లింగ్ సినిమా హక్కులను డిస్నీప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. కాగా, ఈ మూవీ కూడా ఆగస్టులోనే స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం.

పేకమేడలు : కామెడీ డ్రామా తరహాలో తెరకెక్కిన పేకమేడలు సినిమాలో యంగ్ హీరో వినోద్ కిషన్, అనూష కృష్ణ హీరో హీరోయిన్స్‌గా నటించారు. కాగా, ఈ సినిమా కూడా త్వరలోనే ఆగస్టులో ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.

రక్షణ : పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషించిన రక్షణ సినిమా ఆగస్టు ఫస్ట్ ఆహాలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం

వీరాంజనేయులు విహారయాత్ర : సీనియర్ యాక్టర్ నరేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు14న ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed