చిన్న సినిమాగా వచ్చి రూ.100 కోట్లు వసూలు చేసిన మూవీస్ ఇవే..!

by sudharani |   ( Updated:2023-07-28 05:59:16.0  )
చిన్న సినిమాగా వచ్చి రూ.100 కోట్లు వసూలు చేసిన మూవీస్ ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా బాగుంటే చాలు వాటికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఈ మధ్య కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్‌తో వచ్చి చాలా ఎక్కువ లాభాలు పొందిన సినిమాలు చాలానే ఉన్నాయి. పెద్ద సినిమాల కలెక్షన్ల కంటే ఈ చిన్న సినిమాలే భారీ వసూళ్లు రాబట్టాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎలాంటి అంచనాలు లేకుండా.. పెద్దగా స్టార్ కాస్ట్ కూడా లేకుండా వచ్చిన సినిమా బలగం. ఈ సినిమా రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి దాదాపు రూ. 11 కోట్ల పైగానే కలెక్ట్ చేసి సంచలన విజయాన్ని అందుకుంది. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన విరుపాక్ష సినిమా కూడా రూ. 30 కోట్ల బడ్జెట్‌కి ఏకంగా వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ. 100 కోట్ల వరకు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ క్రమంలోనే యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమా కూడా ఎలాంటి అంచనాలు లేకుండా రూ. 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దాదాపు రూ. 32 కోట్లు కలెక్ట్ చేసి ఇప్పటికి థియేటర్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్నావుతూనే ఉంది. ఇక రీసెంట్‌గా ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా కూడా ఎలాంటి అంచనాలు లేకుండా రూ. 7 కోట్ల బడ్జెట్‌తో వచ్చి ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టడమే కాకుండా.. ఇప్పటికి ఈ సినిమా థియేటర్స్‌లో సక్సస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. ఇలా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. భారీ వసూళ్లు రాబట్టిన సినిమాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్రింది లింక్‌ను క్లిక్ చెయ్యండి.

Advertisement

Next Story