Divorce : ఈ సంవత్సరంలో విడాకులు తీసుకొని విడిపోయిన సెలబ్రిటీస్ వీరే!

by Jakkula Samataha |
Divorce : ఈ సంవత్సరంలో విడాకులు తీసుకొని విడిపోయిన సెలబ్రిటీస్ వీరే!
X

దిశ, సినిమా : ప్రస్తుతం విడాకుల ట్రెండ్ కొనసాగుతోంది. చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోవడం చాలా కామన్ అయిపోయింది. ఇటీవల టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో వీరికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు డివోర్స్ తీసుకొని విడిపోయారు. కాగా,2024లో విడిపోయిన సెలబ్రిటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ : వీరు ప్రేమించి పెళ్లి చేసుకొని, మనస్పర్థల కారణంగా ఈ సంవత్సరం విడాకులు తీసుకొని విడిపోయారు. వీరికి ఒక కుమారుడు. అతను ప్రస్తుతం సానియా వద్దనే ఉంటున్నాడు. ఇక షోయబ్ మరో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అర్జున్ కపూర్, మలైకా అరోరా : అర్జున్ కపూర్, మలైక చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. వీరు పెళ్లి చేసుకొని కలిసి ఉండకపోయినా, భార్య భర్తల్లా ప్రతి ఈవెంట్స్‌కు హాజరవుతూ వీరు కలిసి ఉన్న ఫోటోలను అభిమానులతో పంచకున్నారు.కాగా, గత కొన్ని రోజులనుంచి వీరు విడిపోయినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.

ఇషా డియోల్, భారత్ తఖ్తానీ : బాలివుడ్ స్టార్ కపుల్ ధర్మేంద్ర, హేమమాలిని గారాల పట్టీ ఇషా డియోల్ కూడా ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు.

ఇషా కొప్పికర్ , టిమ్మీ నారంగ్: నటి ఈషా కొప్పికర్ , వ్యాపారవేత్త టిమ్మీ నారంగ్ వీరు ఈ సంవత్సరం ఆరంభంలోనే విడాకులు తీసుకొని విడిపోయామని ప్రకటించిన విషయం తెలిసిందే.

హార్ధిక్ పాండ్యా, నటాషా : హార్ధిక్, నటాషా విడాకులు తీసుకున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి అనేక రూమర్స్ వస్తుండగా, వాటిని నిజం చేస్తూ, వారు గురువారం , తమ వివాహ బంధాన్ని రద్ధు చేసుకొని విడిపోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరికి ఒక కుమారుడు అగస్త్య అతనికి కో పేరెంట్‌గా కొనసాగుతామని వారు ప్రకటించారు.

Advertisement

Next Story