ఛాన్సుల కోసం కమిట్ మెంట్ ఇస్తే తప్పు లేదు.. యాంకర్ విష్ణుప్రియ వైరల్ కామెంట్స్..!

by Hamsa |   ( Updated:2023-04-25 10:18:32.0  )
ఛాన్సుల కోసం కమిట్ మెంట్ ఇస్తే తప్పు లేదు.. యాంకర్ విష్ణుప్రియ వైరల్ కామెంట్స్..!
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ‘పోవే పోరా’ షోతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జబర్దస్త్ షో తో ప్రేక్షకుల్లో పాపులారిటీని దక్కించుకుంది. ఇటీవల విడుదలైన ప్రైవేట్ ఆల్బమ్ ‘జరీ జరీ పంచె కట్టి’ పాటతో తన అందాలతో కుర్రకారు మతి పోగొట్టింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ గ్లామర్ షో‌తో రచ్చ చేస్తోంది. తాజాగా, ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. అందులో భాగంగా కొన్ని సార్లు కాస్టింగ్ కౌచ్‌ను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాంటి వాటికి మనం చాలా ధైర్యంగా ఉండాలి. కొన్ని సార్లు కమిట్ మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా సరే అస్సలు బాధ పడకూడదు. అవకాశాల కోసం ఇలాంటివి చేసే వారు కూడా ఉంటారు. అలాంటి వారిని తప్పు బట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వారి పరిస్థితి. నేను అయితే నా ట్యాలెంట్ తోనే ఛాన్సులు అందుకుంటున్నాను’ అంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విష్ణుప్రియ ఆల్బమ్ సాంగ్స్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది.

Also Read..

నిహారికకు నాగబాబు రెండో పెళ్లి ఫిక్స్ చేశారా?

Advertisement

Next Story