అలా చేయడానికి అభ్యంతరం ఏం లేదు.. తాప్సీ ఆసక్తికర కామెంట్స్

by sudharani |   ( Updated:2023-10-05 11:36:28.0  )
అలా చేయడానికి అభ్యంతరం ఏం లేదు.. తాప్సీ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ తాప్సీ పన్ను ఝుమ్మంది నాదం మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు హిట్ మూవీస్‌తో అమ్మడు పాపులారిటీని పెంచుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించి మెప్పించింది. ఇక 2016లో బాలీవుడ్‌లో నటించిన ‘పింక్‌’ మూవీతో తాప్సీ కెరీర్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ విజయంతో తాప్సీ పేరు బాలీవుడ్‌లో ఒక్కసారిగా మారుమోగింది. ప్రస్తుతం తాప్సీ ఉమెన్ ఓరియెంటెడ్ మూవీలతో విజయాలు అందుకుంటూ దూసుకుపోతుంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తెలుగులో ఎందుకు నటించడం లేదు? అని యాంకర్ అడగ్గా దానికి ఈ అమ్మడు స్పందిస్తూ.. ‘నేనేం చేయను సరైన అవకాశాలు రావడం లేదు అడపా దడపా వచ్చని కథలేమో నచ్చట్లేదు. స్టోరీ నచ్చకపోతే ఎలా చేయను’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే కమర్షియల్ హీరోలతో మాస్ సినిమాల్లో ఎందుకు నటించడం లేదన్న ప్రశ్న ఎదురైంది. దానికి తాప్సీ.. ‘అలాంటి అవకాశాలు రావడం లేదు. వస్తే చేయడానికి అభ్యంతరం ఏముంది? అని సమాధానమిచ్చింది. అలాగే చిన్ని సినిమాల్లో డబ్బులు తక్కువ వచ్చినా అలాంటి వాటిల్లో నటించడం వల్ల ఆత్మ సంతృప్తి ఉంటుంది. కథ అంతా నా చుట్టే తిరుగుతుంది కాబట్టి థియేటర్స్‌కి జనాలు వస్తారు’’ అని తెలిపింది.

Read More: స్టార్ సింగర్‌కు వార్నింగ్ ఇచ్చిన జాక్వెలిన్‌ ప్రియుడు.. రిపీట్ అయితే నీ బతుకు బజారే అంటూ!

Advertisement

Next Story