మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడు.. ఏడ్చేసిన ‘బేబి’ హీరోయిన్ వైష్ణవి

by Nagaya |   ( Updated:2023-09-02 08:16:03.0  )
మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడు.. ఏడ్చేసిన ‘బేబి’ హీరోయిన్ వైష్ణవి
X

దిశ, సినిమా: ప్రతి రాఖీ పండుగకు సంబంధించిన సెలబ్రేషన్స్‌ను సెలబ్రిటీలంతా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి కూడా ఈసారి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నట్లు చెబుతూ తన సోదరుడు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడని తెలిపింది. ‘మా తమ్ముడు మరిచిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. తన లెఫ్ట్ హ్యాండ్‌పై వైషు అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. కానీ నేను మొదటగా ఆ టాటూ చూసి ఆటపట్టిస్తున్నాడు అనుకున్న. కానీ తర్వాత అది నిజమైన టాటూనే అని తెలిసి చాలా ఏడ్చాను. వాడికి ఈ టాటూ వేయించుకోవడానికి మూడు గంటలు పట్టిందట. రాఖీ కట్టిన తర్వాత ఇదే గిఫ్ట్ అంటూ చూపించాడు’ అంటూ చెప్పుకొచ్చింది వైష్ణవి.

Read More: ‘ఆశికీ 3’లోకి బోల్డ్ బ్యూటీ.. కత్రిన, దీపికలను రిజెక్ట్ చేసిన మేకర్స్!

Advertisement

Next Story