- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీదేవి మరణంపై తప్పుడు పత్రాలు సృష్టించిన మహిళ.. రంగంలోకి సీబీఐ!
దిశ, సినిమా: ఒకప్పటి టాలీవుడ్ అందాల తార, దివంగత హీరోయిన్ శ్రీదేవి గురించి సుపరిచితమే. ఆమె మరణించిన ఏళ్లు గడుస్తున్నా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఇంకా బతికే ఉంది. అంతటి గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న ఈ బ్యూటీ జగదేక వీరుడు అతిలోక సుందరి, మామ్, ఇంగ్లీష్ వింగ్లీష్, మిస్టర్ ఇండియా, నాగిని, చాందిని, అన్నయ్య వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి.. తన అందం, అభినయం, డాన్స్‌తో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది.
ఇదంతా పక్కన పెడితే ఇటీవల ఓ వ్యక్తి శ్రీదేవి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి నెట్టింట పోస్టు పెట్టాడు. అది కాస్త వైరల్‌గా మారింది. సౌందర్య మరణంపై తాను సొంతంగా విచారణ జరిపానని, యూఏఈ-భారత్ ప్రభుత్వాలు నిజాలను దాచిపెట్టినట్లు తేలిందంటూ కలకలం రేపాడు. ఇదిలా ఉండగా..
శ్రీదేవి మరణంపై నిజాలు దాచిపెట్టారని ఆరోపిస్తూ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన దీప్తి ఆర్ పిన్నింటి అనే ఓ మహిళ నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న సీబీఐ.. ఆమెపై ఛార్జిషీటు దాఖలు చేసినట్లు వెల్లడించింది. ఛార్జిషీటు పై స్పందించిన దీప్తి తన వాంగ్మూలం నమోదు చేయకుండానే సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో సీబీఐ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
- Tags
- Sridevi