మరోసారి అడ్డంగా బుక్ అయిన బాలకృష్ణ.. పబ్లిక్‌గా అంజలిని అక్కడ టచ్ చేసిన వీడియో వైరల్!

by Jakkula Samataha |   ( Updated:2024-06-01 04:38:23.0  )
మరోసారి అడ్డంగా బుక్ అయిన బాలకృష్ణ.. పబ్లిక్‌గా అంజలిని అక్కడ టచ్ చేసిన వీడియో వైరల్!
X

దిశ, సినిమా : ప్రస్తుతం సోషల్ మీడియాలో, చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏదైనా ఉందా అంటే అది బాలయ్యనే. ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన రచ్చ నెట్టింటె తెగ వైరల్‌గా మారుతోంది. రోజు రోజుకు దీనిపై కామెంట్స్ వినిపిస్తూ.. ట్రోలింగ్‌కు గురి అవుతోంది. ఆయన స్టేజ్ పై హీరోయిన్ అంజలిని తోసివేయడం.. కానీ దానిని హీరోయిన్ నవ్వుతూ కవర్ చేయడం చర్చానీయాంశంగా మారింది.

దీంతో బాలకృష్ణపై పలవురు మండిపడుతున్నారు. అయితే ఇది సరదాగా మాత్రమే జరిగిందని విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ తెలిపినా ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా అంజలి కూడా ఇది కామన్‌గా జరిగింది, బాలయ్యకు తనకు ఎలాంటి వివాదం లేదు అని కవర్ చేసింది. అయినా ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఈవెంట్‌లో బాలకృష్ణ ఫుల్‌గా మందుకొట్టారు. అందుకే హీరోయిన్‌తో అలా బిహేవ్ చేశారంటూ నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మరో వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బాలయ్య మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు. అంజలి తన ప్లేస్‌లో సోఫాలో కూర్చొనే క్రమంలో, బాలకృష్ణ అంజలిని తన లెఫ్ట్ హ్యాండ్‌తో ఆమె వెనుక భాగంలో టచ్ చేస్తాడు. ఆ సమయంలో అంజలి కూడా స్మైల్ ఇస్తూనే వెల్లిపోయింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇక ఇది చూసిన బాలయ్య ఫ్యాన్స్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్‌కు వచ్చి వివాదంలో చిక్కుకున్నావా అంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉందని అంటున్నారు మరికొందరు.

Advertisement

Next Story

Most Viewed