- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nepolean: ప్రముఖ నటుడి కుమారుని పెళ్లి.. డబ్బు ఆశ చూపి ఆమె జీవితాన్ని సర్వ నాశనం చేస్తున్నారంటూ ట్రోల్స్
దిశ, సినిమా: ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు నెపోలియన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీలో విలన్‌గా, హీరోగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అయితే, కొన్నేళ్ల క్రితం ఇండస్ట్రీని, తన సొంతూరిని విడిచిపెట్టి కుమారుడి ఆరోగ్యం కోసం అమెరికాలో సెటిలైపోయారు.
నెపోలియన్ కుమారుడు ధనుష్‌కు నాలుగేళ్ల వయసులోనే 'మస్క్యూలర్ డైస్ట్రోపి' (కండరాల బలహీనత) అనే వ్యాధి వచ్చింది. దీంతో శరీరం అంతా చచ్చుబడి పోయింది. అలా అప్పటి నుంచి వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యాడు. అయితే, ఇప్పుడు ఆయనకు పెళ్లి చేస్తుండటంతో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన అక్షయతో ధనుష్ వివాహం ఈ ఏడాది నవంబర్ నెలలో జరగనుంది. అందుకు జపాన్ వేదిక కానుంది. వీరిద్దరి నిశ్చితార్థం ఇప్పటికే వీడియో కాల్ ద్వారా జరిగింది. అమెరికా నుంచి చెన్నైకు వచ్చేందుకు ధనుష్ ఆరోగ్యం సహకరించకపోవడంతో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే కొద్ది రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా వీరి పెళ్లిపై నెట్టింట తెగ ట్రోల్స్ జరుగుతున్నది. అందులో భాగంగా.. కండరాల బలహీనతతో వీల్ చైర్‌కు పరిమితం అయిన కుమారుడికి పెళ్లి చేసి మరో యువతి జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం అని.. డబ్బు ఆశ చూపి ఆమె జీవితాన్ని సర్వ నాశనం చేస్తున్న నెపోలియన్ అని.. పెళ్లి తర్వాత ఆమె కేవలం ఒక నర్సుగా మాత్రమే ధనుష్‌తో ఉండగలదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అలాగే మరి కొంత మంది అసలు అతనితో ఆమె సంతోషంగా ఎలా జీవించగలదంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా మయోపతి వైద్యుని నుంచి సలహాలు తీసుకున్న తర్వాతనే ధనుష్‌కు పెళ్లి చేస్తున్నట్లు ఆయన కుటుంబ సన్నిహితులు తెలుపుతున్నారు.