ఆస్కార్ విజయోత్సవం : ‘RRR’ టీమ్‌ను సత్కరించనున్న తెలంగాణ ప్రభుత్వం!

by Prasanna |   ( Updated:2023-03-14 06:18:52.0  )
ఆస్కార్  విజయోత్సవం : ‘RRR’  టీమ్‌ను సత్కరించనున్న తెలంగాణ ప్రభుత్వం!
X

దిశ, సినిమా: టాలీవుడ్‌తోపాటు యావత్ భారత దేశం ఎదురు చూసిన ఆస్కార్ అపూర్వ ఘట్టం పూర్తయింది. అందరూ ఊహించినట్లుగానే ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ను గెలుచుకుంది. దీంతో హీరోలు ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌తో పాటు టోటల్ టీమ్ సంతోషంతో ఉప్పొంగిపోతోంది. అలాగే అభిమానులు, సినీ ప్రముఖులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్‌ను సత్కరించాలని నిర్ణయించింది. ఇందుకోసం గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఈవెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే టీమ్ అంతా యూఎస్‌లో ఉంది. హైదరాబాద్‌కు తిరిగి రాగానే ఈవెంట్ జరిగే అవకాశాలున్నాయి.

Read more:

Rajamouli: రాజమౌళి పొలిటికల్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?

Advertisement

Next Story

Most Viewed