అమితంగా ఆకట్టుకుంటున్న ‘ఫర్హానా’ టీజర్

by Prasanna |   ( Updated:2023-10-10 16:09:39.0  )
అమితంగా ఆకట్టుకుంటున్న ‘ఫర్హానా’ టీజర్
X

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ప్రేక్షకులను బాగా అకట్టుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్‌తో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లతో దర్శకులు ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులకు అందిస్తున్నారు. సొసైటీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకుని, సినిమా రూపంలో చూపిస్తున్నారు. ఇలాంటి చిత్రంతోనే రాబోతుంది ఐశ్వర్య రాజేష్. ‘ఫర్హానా’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీని నెల్సన్ వెంకటేషన్ తెరకెక్కించారు. ఈ మూవీ ఏకకాలంలో తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. కాగా తాజాగా ప్రమోషన్‌లో భాగంగా ఈ మూవీ టీజర్‌ని స్టార్ హీరోయిన్ రష్మిక మందన లాంచ్ చేసింది. టీజర్ ప్రకారం కాల్ సెంటర్ జాబ్స్‌లో జరిగే దారుణాలు ఈ మూవీ కథకు మూలంగా చూపించారు. మొత్తానికి మంచి మెసేజ్‌తోనే రాబోతుంది ఈ ‘ఫర్హానా’ మూవీ.

Advertisement

Next Story