మెగా ఇంట్లో మోగనున్న బాజాలు.. సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన టీమ్!

by Hamsa |   ( Updated:2024-07-23 15:37:37.0  )
మెగా ఇంట్లో మోగనున్న బాజాలు.. సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన టీమ్!
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటూ సినిమాలకు గ్యాప్ ఇస్తున్నారు. అయితే కొందరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత రెండు రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరకు కలిసి నటించి జవాన్ మూవీ నుంచి లవ్‌లో ఉన్నారంటూ తొందరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారంటూ పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.

అంతేకాకుండా చిరంజీవి, పవన్ కల్యాణ్ బిజీగా ఉండటం వల్ల ముహుర్తాలు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా, సాయి ధరమ్ తేజ్ టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘అవన్నీ అబద్దాలే. హీరోయిన్‌తో వస్తున్న పెళ్లి వార్తలన్నింటిలో వాస్తవం లేదు. ఆయన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాము. కానీ అబద్ధాలను ప్రచారం చేయకండి ’’ అని తెలిపారు. కాగా..ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఓ భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి రూ. 120 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆగస్ట్‌లో స్టార్ట కాబోతున్నట్లు సమాచారం. ఇది 2025 లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Next Story