స్టార్ హీరో తీరు వివాదాస్పదం.. నెటిజన్ల ఫైర్! (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-08 16:07:44.0  )
స్టార్ హీరో తీరు వివాదాస్పదం.. నెటిజన్ల ఫైర్! (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. అక్షయ్ కుమార్ ఉత్తర అమెరికా టూర్ ను ప్రమోట్ చేస్తూ ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఉత్తర అమెరికాలోని ప్రేక్షకులకు 100 శాతం వినోదాన్ని పంచేందుకు ది ఎంటర్ టైనర్స్ వాళ్లు సిద్ధంగా ఉన్నారు. మీరంతా సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండండి. మేము మార్చిలో మీ ముందుకు వస్తున్నాం. అనే క్యాప్షన్ ను ట్వీట్ కు జత చేశారు.

ఇదంతా బాగానే ఉన్నా అక్షయ్ కుమార్ షూ వేసుకుని గ్లోబ్ పై నడుస్తూ ఉన్న ఈ ప్రమోషనల్ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోలో అక్షయ్ తో పాటు దిశా పటానీ, నోరా ఫతేహీ, మౌనీరాయ్ ఉన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దేశాన్ని 'కాస్తయినా గౌరవించండి', 'కెనడా పౌరసత్వం ఉన్న వ్యక్తి కాబట్టే ఇలా చేశాడని' కొందరు కామెంట్ చేస్తున్నారు. 'ఇదేంటీ ఇలా చేశావు కెనెడియన్ కుమార్', 'షేమ్ ఆన్ యూ వేరీ బ్యాడ్' అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story