Samantha Ruth Prabhu : బొద్దింక, సీతాకోక చిలుక కథ చెప్పిన సమంత!

by Prasanna |   ( Updated:2023-08-13 10:34:13.0  )
Samantha Ruth Prabhu : బొద్దింక, సీతాకోక చిలుక కథ చెప్పిన సమంత!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. అయినప్పటికి సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించి ఎన్నో పోస్ట్‌లను షేర్ చేస్తుంది. ఇక తాజాగా షేర్ చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ‘ఒకవేళ మీరు బొద్దింకను చంపితే హీరో. అదే సీతాకోక చిలుకను చంపితే విలన్. నైతికతకు కూడా సౌందర్య ప్రమాణాలు ఉంటాయి’ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇక్కడ ఆమె చెప్పిన మాటలు గొప్పగా ఉన్నప్పటికీ ఎందుకు చెప్పిందో మాత్రం అర్థం కాలేదు. దీంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ‘సమంతకు ఏమైంది? అంతా ఓకేనా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More: కోట్లు సంపాదించినా ఏం లాభం అంటూ.. Anchor Sumaని ఏకిపారేస్తున్న నెటిజెన్స్? కారణం ఇదే!

Next Story