అభిమాని పై ఫుల్ ఫైర్ అయిన స్టార్ హీరోయిన్..ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Jakkula Mamatha |   ( Updated:2024-02-14 10:16:23.0  )
అభిమాని పై ఫుల్ ఫైర్ అయిన స్టార్ హీరోయిన్..ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్ డెస్క్ :టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీకి చలో మూవీ తో పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కాకపోయినా ఈ బ్యూటీకి తెలుగు సినీ రంగంలో వరుస ఆఫర్లు వచ్చాయి. గీత గోవిందం, దేవదాస్ మూవీ లో నటించి హిట్ అందుకుంది. ఈ మూవీస్ తర్వాత నేషనల్ క్రష్ క్రేజ్ మరింత పెరిగింది. అంతే కాదు ఈ ముద్దుగుమ్మ కు బాలీవుడ్, టాలీవుడ్ లోను ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. పుష్ప మూవీలో బన్నీ సరసన నటించిన ఈ బ్యూటీ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకుల మనసు లు దోచుకుంది. నేషనల్ క్రష్ తన అందంతో, అభినయంతో కుర్రకారు హృదయాలను పాన్ ఇండియా లెవెల్ లో షేక్ చేస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ 2022 లో శర్వానంద్ సరసన ‘ ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ లో నటించింది. ఈ మూవీ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ గురించి ఆమె పై వస్తున్న నెగటివ్ టాక్ ను ఖండిస్తూ ట్వీట్ చేసింది. అయితే ఆ మూవీ సమయంలో ఆమె ఇంటర్వ్యూ కి అటెండ్ అయిన ఈ మూవీ గురించి నెగటివ్ గా ఎప్పుడు మాట్లడలేదని చెప్పింది. కానీ రీసెంట్ గా తనపై ఒక అభిమాని చేసిన కామెంట్ కు రష్మిక తీవ్రంగా మండిపడింది. స్క్రిప్ట్ నచ్చకపోయినా కేవలం శర్వానంద్ కోసం ఆ మూవీ చేసినట్లు తానే స్వయంగా చెప్పానని వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించింది.

నాకు సినిమా స్ర్కిప్ట్ నచ్చలేదనీ నీకు నేను ఏమైనా చెప్పాన అంటూ సదరు అభిమాని పై ఫైర్ అయింది. నా అనుమతి లేకుండా నేను చెప్పాని వాటిని మీరు ఏలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారనీ ఆమె ఫ్యాన్స్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. నేషనల్ క్రష్ ఈ విషయం పై తీవ్రంగా స్పందిస్తూ.. నేను స్క్రిప్ట్ ను నమ్మే సినిమాలు చేస్తానని గట్టిగానే సమాధనం ఇచ్చింది. ఇలాంటి ఫ్రూప్స్ లేని వార్తలు ఎక్కడి నుంచి వస్తాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ట్విట్టర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story