ఆ విషయంలో అదేపనిగా బేరాలు ఆడుతుంటారంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్

by Prasanna |   ( Updated:2024-05-15 06:58:34.0  )
ఆ విషయంలో అదేపనిగా బేరాలు ఆడుతుంటారంటూ..  షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా: సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్లో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. సౌత్ లోనూ కూడా ఓ మూవీలో నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లింగ సినిమాలో హీరోయిన్ గా చేసింది సోనాక్షి సిన్హా. కానీ, ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఆచితూచి సినిమాలను ఎంచుకుని ముందుకు వెళ్తుంది. ‘హీరమండి: ది డైమండ్ బజార్ ఓటీటీలో రిలీజ్అయినా సంగతి మనకి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో సోనాక్షి అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, తాజాగా సోనాక్షి సిన్హా చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి సినిమా హిట్ అవ్వదు. ఆ తర్వాత పాత్రల ఎంపికను పూర్తిగా మార్చుకున్నాను. వాటిలో కొన్ని విజయవంతమయ్యాయి, మరికొన్ని విజయవంతం కాలేదు. ఆర్టిస్ట్‌గా నేను ఈ చిత్రాలను ఆస్వాదించాను. ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేవు. కానీ కొంతమంది టీమ్ మెంబర్స్‌తో కలిసి పని చేయడం చాలా బాగుంది. అయినా ఎందుకు విజయం సాధించడం లేదని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది సోనాక్షి.

బాక్సాఫీస్ రిజల్ట్ నా చేతుల్లో లేదు. అది నాకు కూడా తెలుసు. నటిగా, మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి. నా నటనకు ఎప్పుడూ ప్రశంసలు వచ్చేవి. “నిర్మాతలు మీకు ఫోన్ చేసినప్పుడు, వారు ప్రతిదీ చర్చిస్తారు. ప్రతి ఒక్కరూ నటీమణులకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటారు. కానీ, డబ్బుల విషయానికి వస్తే అదేపనిగా బేరాలు చేస్తారంటూ సోనాక్షి కామెంట్స్ చేసింది.

Advertisement

Next Story