Prema Kavali Movie : ప్రేమకావాలి ఆ మెగా హీరోతో చేయాల్సిన మూవీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్

by Prasanna |
Prema Kavali Movie : ప్రేమకావాలి ఆ మెగా హీరోతో చేయాల్సిన మూవీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్
X

దిశ, సినిమా : సాధారణంగా ప్రేమ కథలు ఆడియెన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతాయి. ఈ లైనుతో వచ్చిన సినిమాలు దాదాపు అన్ని హిట్ అయ్యాయి. ఎలాంటి సినిమా అయినా దానిలో ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. లవ్ లేని సినిమాలు చాలా తక్కువ ఉంటాయి అవి కూడా వెతికితే తప్ప దొరకవు. అలాంటి ప్రేమ కథతో సినీ ఇండస్ట్రీకి పరిచయమై ప్రేమ కావాలితో హిట్ కొట్టిన హీరో ఆది సాయి కుమార్మనందరికీ తెలిసిందే. కానీ, వాస్తవానికి ఈ అవకాశం ముందుగా మెగా హీరో వద్దకు వచ్చింది సమయం లేకపోవడం వలన సినిమా చేయలేదు. ఆ హీరో ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

ఎన్ని లవ్ స్టోరీ సినిమాలు వచ్చిన ప్రేమ కావాలి మూవీ అందరికీ గుర్తు ఉంటుంది. మెగా మేనల్లుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ విజయ్ భాస్కర్ ఉషా పరిణయం అనే కొత్త మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా సాయి ధరమ్ తేజ్ అటెండ్ అయ్యారు. ఆ స్టేజ్ పై విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. దీని గురించి తెలిపారు.

" సాయి ధరమ్ తేజ్‌ను పరిచయం చేసే అవకాశం ముందుగా నాకే వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. అదే మూవీ ఆదితో ప్రేమ కావాలి తీశాను తేజ్ అప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. పెద్ద వాళ్ళతో మాట్లాడేటప్పుడు చిరంజీవి ఎలా గౌరవిస్తారో మళ్లీ అలా నేను సాయి ధరమ్ తేజ్ దగ్గరే చూసానని" విజయ్ భాస్కర్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story