ఆ ఇన్సిడెంట్ గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్న స్టార్ కమెడియన్

by Anjali |   ( Updated:2023-08-11 14:28:02.0  )
ఆ ఇన్సిడెంట్ గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్న స్టార్ కమెడియన్
X

దిశ, వెబ్‌డెస్క్: వెండితెరపై నవ్వులు పూయించే బాబు మోహన్ ప్రస్తుతం బుల్లితెరపై ఓ ప్రముఖ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షో కొత్త ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇందులో చిన్న పిల్లలు చేసిన స్కిట్ చూసి బాబు మోహన్ ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలో జరిగిన చేదు సంఘటనలను పంచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘అమ్మ మా చిన్నతనంలోనే చనిపోయింది. దాంతో నాన్న.. నన్ను, చెల్లెల్ని వదిలేసి వెళ్లిపోయారు. అప్పుడు మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోలేదు. చాలా కష్టాలు అనుభవించాను. నా చెల్లెలకి నేనే జడలు వేసేవాడిని’’ అంటూ కమెడియన్ చెప్పుకొచ్చారు. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఈయన జీవితంలో ఇంత విషాదం ఉందని బహుషా ఎవరూ అనుకోలేదేమో, కేవలం తన టాలెంట్‌తో దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో నటించి మెప్పించారు.’’ అంటూ జనాలు ఈ కమెడియన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం బాబు మోషన్ రాజకీయాల్లో బిజీగా గడిపేస్తున్నారు.

Advertisement

Next Story