ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ నటి మృతి!

by Anjali |   ( Updated:2023-08-24 09:50:29.0  )
ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ నటి  మృతి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆనంద్, కోరా కాగజ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ నటి ‘సీమా డియో’ కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ రోజు (ఆగస్టు 24) ఉదయం 8.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె కుమారుడు అభినయ్ డియో సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘మా అమ్మ మూడేళ్ల నుంచి అల్జీమర్స్, డిమెంటియా వ్యాధితో పోరాడుతుంది. ఈ వ్యాధి వల్ల తన కండరాల్లో బలం పూర్తిగా క్షీణించింది. దీంతో ఒక్కో అవయవం దెబ్బతింటూ వచ్చింది.’ అంటూ సీమా తనయుడు తెలిపారు. ఈ రోజు సాయంత్రం శివాజీ పార్క్‌లో అంత్యక్రియలను నిర్వహించబోతున్నామని అన్నారు. కాగా బాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులంతా సీమా మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

Read More: ఎన్టీఆర్‌తో సినిమా ఛాన్స్‌ను ఏడుసార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story