వివాదాన్ని లెక్కచేయకుండా మాల్దీవుల్లో బర్త్‌ డే సెలబ్రేషన్స్ చేసుకున్న స్టార్ నటి.. నెటిజన్ల ఆగ్రహం

by Hamsa |   ( Updated:2024-01-09 06:00:43.0  )
వివాదాన్ని లెక్కచేయకుండా మాల్దీవుల్లో బర్త్‌ డే సెలబ్రేషన్స్ చేసుకున్న స్టార్ నటి.. నెటిజన్ల ఆగ్రహం
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో మాల్దీవుల వివాదం వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రధాని మోడీ లక్షద్వీప్‌లో పర్యటించి సాహసాలు చేయాలనుకునేవారు అక్కడికి వెళ్లాలని సూచించారు. దీనిపై మల్దీవుల ఎంపీ జహీద్ మరీజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో భారతీయులు మండిపడుతున్నారు. దీనిపై సెలబ్రిటీలు పలు పోస్టులు కూడా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ నటి బిపాసా బసు తన 45న పుట్టిన రోజు సెలబ్రేషన్స్ మాల్దీవుల్లో జరుపుకుని నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది.

హాట్ బ్యూటీ బిపాసా బసు తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్, కూతురు దేవితో మాల్దీవుల్లో జనవరి 7న బర్త్ డే చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బిపాసా బసును బైకాట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మధ్యలో మోడీని తీసుకొచ్చి ప్రధాని మాట కూడా లెక్కచేయకుండా అలా చేయడమేంటని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story