స్టార్ హీరో నన్ను రూమ్‌లోకి రమ్మన్నాడు.. వెళ్లి పడుకున్నా.. సంచలనం సృష్టిస్తోన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ కామెంట్స్ (వీడియో)

by Hamsa |   ( Updated:2023-11-26 17:12:14.0  )
స్టార్ హీరో నన్ను రూమ్‌లోకి రమ్మన్నాడు.. వెళ్లి పడుకున్నా.. సంచలనం సృష్టిస్తోన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ షో దాదాపు అన్ని బాషల్లో సీజన్లకు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంటున్నాయి. ఈ రియాలిటీ షోకు జనాల ఆదరణ చాలానే ఉంది. అయితే ఇందులో ఎంతో మంది నటీ నటులు కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తమ జీవితంలో జరిగిన అనుభవాలను పంచుకుని ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, తమిళ బిగ్‌బాస్ షోలో నటి ఒకప్పుడు తనకు జరిగిన కాస్టింగ్ కౌచ్ గురించి తెలిపింది. తనకు జరిగిన ఘటన మీద నోరు విప్పి మొదటి సారిగా అందరికీ తెలిసేలా చెప్పింది. బిగ్ బాస్ తమిళ్ ప్రస్తుత ఏడో సీజన్ లో నటి విచిత్ర చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో 50 పూర్తి చేసుకున్నందున ఆమె ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఇది 23 ఏళ్ల క్రితం జరిగింది.. నాకు ఓ సినిమా ఆఫర్ వచ్చింది.

ఆ వివరాలు చెప్పదల్చుకోవడం లేదు.. కేరళలో షూటింగ్.. అక్కడే నా భర్తను కూడా కలిశాను.. అక్కడ నాకు దారుణమైన అనుభవం ఎదురైంది.. అలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఘటన నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు.. నా పెళ్లి జరగడంతో సినిమాలకు దూరం అయ్యాను అని అనుకున్నారు. కానీ అసలు విషయం అది కాదు.. ఈ ఘటన తర్వాతే సినిమాలు మానేశాను. ఆ ఘటనను, నా మనసుకు తగిలిన గాయాన్ని మరిచిపోవాలని అనుకున్నాను. కానీ ఇంకా ఆ గాయం తాలుకు బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మమ్మల్ని ఆప్పుడు ఓ త్రీ స్టార్ హోటల్‌లో పెట్టాడు. ఆ హోటల్ మేనేజర్ తర్వాత నాకు భర్తగా మారారు. అక్కడ ఓ పెద్ద స్టార్ హీరోని కలిశాను. ఆయన కనీసం నా పేరు కూడా అడగలేదు.. మీరు ఈ సినిమాలో నటిస్తున్నారా? అయితే నా రూమ్‌కి రా అని అన్నాడు.. ఇలా అన్నాడేంటని ఒక్కసారిగా షాక్ అయ్యాను.. ఆ రోజు రాత్రి నా రూమ్‌కి వెళ్లి నేను పడుకున్నాను. కానీ నెక్స్ట్ రోజు రాత్రి నుంచి నాకు నరకాన్ని చూపించారు.

అలాంటి ఘటన నాకు ఎప్పుడూ కూడా తమిళ సినిమా సెట్లలో జరగలేదు.. ఆ సినిమా కోసం పని చేసే వ్యక్తి ఒకడు ప్రతీ రోజూ నా రూమ్ డోర్ కొట్టేవాడు.. నా రూమ్‌కి ఫోన్లు వచ్చేవి.. ఇదంతా గమనించిన హోటల్ మేనేజర్ నాకు సాయం చేశాడు. సినిమా టీంకు తెలియకుండా రూం మార్చేవారు.. అది తెలియక రోజూ వచ్చి డోర్ కొట్టేవారు. లోపలే నేను ఉన్నానని అనుకునేవారు. ఇలా ఒక రోజు సెట్‌లో ఓ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. బై మిస్టేక్ అలా చేస్తున్నాడేమో అని వదిలేశాడు. మళ్లీ రెండో టేక్‌లోనూ అలానే చేశాడు. వెళ్లి యాక్షన్ కొరియోగ్రాఫర్‌కు కంప్లైంట్ చేశా.. అందరి ముందు ఆ స్టంట్ మెన్ నన్ను అందరి ముందు చెంప మీద కొట్టాడు.. ఆ టైంలో సెట్‌లో ఏ ఒక్కరూ నాకోసం ముందుకు రాలేదు.. తప్పు అని చెప్పలేదు.. మాట్లాడలేదు.. ఆ రోజు ఎంతో బాధ, కోపం, కసి నాలో కలిగింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను.. లాయర్‌ని కలిశాను.. రెండు రోజుల్లో నా దెబ్బలన్నీ మాయం అయ్యాయి.. కోర్టు హియరింగ్‌కి కూడా ఎవ్వరూ రాలేదు.. ఆ హియరింగ్ టైంలోనే నా భర్త, ఆ హోటల్ మేనేజర్ సాక్షిగా నిలిచారు. అప్పడే నా కెరీర్ ముగిసిందని నాకు అర్థమైంది’’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె అతను ఎవరో రివీల్ చేయనప్పటికీ విచిత్ర చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Advertisement

Next Story