ప్రియుడి కోసం వేచి చూస్తున్న Samantha!

by Prasanna |   ( Updated:2023-01-19 09:20:41.0  )
ప్రియుడి కోసం వేచి చూస్తున్న Samantha!
X

దిశ, సినిమా: సమంత హీరోయిన్‌గా గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'శాకుంతలం'. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఫిబ్రవరి 17న త్రీడీలో రిలీజ్‌కానుంది. ఇక ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రంనుంచి మొదటి పాటను రిలీజ్ చేశారు మేకర్స్. 'మల్లికా మల్లికా' అంటూ సాగే పాటను సింగర్ రమ్య బెహరా ఆలపించగా అభిమానులను అలరిస్తోంది. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా మణిశర్మ సంగీతం సమకూర్చారు. కాగా అడవికి వచ్చిన దుష్యంత రాజు ప్రేమలో పడిన శాకుంతల.. అతనికి తన శరీరాన్ని అర్పించుకుంటుంది. దీంతో గర్భం దాల్చి పురుడు పోసుకునేందుకు సిద్ధం అవుతుంది. అయినా కూడా తనను ఏలే వాడు రాలేదనే వేదనలో ఈ పాట సాగుతుండగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

Read More... ఆ వేదికే నీకు జీవితాన్నిచ్చిందని మరిచావా? రాధికపై సయంతని ఫైర్


Also Read....

యూఎస్‌ బాక్సాఫీస్‌లో 'వాల్తేరు వీరయ్య' విధ్వంసం!

Advertisement

Next Story