మ్యూజిక్ ఈవెంట్‌లో ఆ యువకుడికి పడిపోయిన సింగర్.. అందరి ముందే డార్లింగ్ అంటూ..

by Shiva |
మ్యూజిక్ ఈవెంట్‌లో ఆ యువకుడికి పడిపోయిన సింగర్.. అందరి ముందే డార్లింగ్ అంటూ..
X

దిశ, సినిమా : ప్రస్తుతం లాస్ వెగాస్‌లో మ్యూజిక్ ఈవెంట్స్ నిర్వహిస్తున్న హాలీవుడ్ సింగర్ అడెలె లేటెస్ట్ షోలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు ఆమె స్టేజిపై ఆడి పాడుతూ ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తుండగా.. ఉత్సాహం తట్టుకోలేక ఓ యువకుడు వేదిక దగ్గరకు వెళ్లి బిగ్గరగా ఆమెతో పాడటం, అరవడం మొదలెట్టాడు. దీంతో ఆ కుర్రాడిని కంట్రోల్ చేసిన సెక్యూరిటీ బలవంతంగా కూర్చోబెట్టి నోరు తెరవొద్దంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే గొడవను గమనించిన అడెలె.. ఆ యువకుడిని వదిలేయాలంటూ సెక్యూరిటీపై సీరియస్ అయింది.

అంతే కాదు ‘వారు ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. డార్లింగ్.. మీరు ప్రదర్శనను ఆస్వాదించండి’ అంటూ అబ్బాయికి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత అబ్బాయిని చేయి పైకి లేపమని అందరిలోనూ తనపై అతనికి ఉన్న అభిమానాన్ని పొగిడేసింది. ఇక దీనిపై ఆమెకు క్లారిటీ ఇచ్చిన సిబ్బంది ‘క్షమించండి.. ఈ అబ్బాయి వెనుక కూర్చున్న వాళ్లను డిస్ట్రబ్ చేస్తున్నాడు. మొత్తం ప్రదర్శనను ఇబ్బంది పెడుతున్నాడు’ అని ఆమెకు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా అడెలె మంచితనాన్ని తెగ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story