Anant-Radhika:పెళ్లై వారం కూడా కాకుండానే.. కలిసి ఉండటం కష్టమేనంటూ నటుడు సంచలన పోస్ట్

by Hamsa |
Anant-Radhika:పెళ్లై వారం కూడా కాకుండానే.. కలిసి ఉండటం కష్టమేనంటూ నటుడు సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ- రాధిక మార్చిలో ప్రీవెడ్డింగ్ వేడుకలు గ్రాండ్‌గా చేసుకున్న సంగతి తెలిసిందే. జూలై 12న గ్రాండ్‌గా ముంబై జీయో కన్వెన్షన్ హాల్‌లో వీరి పెళ్లి జరగాయి. అయితే ఈ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి సినీ రాజకీయ ప్రముఖులు హారజై సందడి చేశారు. ఇప్పటి వరకు పెళ్లికి ముందు తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ అట్టహాసంగా జరిగాయి. గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా అనంత్ అంబానీ పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. వీరిద్దరు పెళ్లి ధరించిన దుస్తులతో సహా అన్ని వస్తువులకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.

అయితే త్వరలోనే వీరి పెళ్లి వేడుకల సెలబ్రేషన్స్ మళ్లీ లండన్‌లో చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అనంత్ అంబానీ పెళ్లిపై పాకిస్థాన్ నటుడు అర్సలన్ నజీర్ సంచలన పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచాడు. ‘‘ ఈ రోజుల్లో పెళ్లి వేడుకలు ఎన్నాళ్లు గ్రాండ్‌గా జరుపుకున్నప్పటికీ.. కనీసం అంతకాలం కూడా బంధాలు నిలబడటం లేదు’’ అని రాసుకొచ్చాడు. అలాగే అనంత్, రాధిక ఫొటోలు షేర్ చేశాడు. ప్రస్తుతం నటుడి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. వాళ్లు చిన్ననాటి ఫ్రెండ్స్ వారి ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు మధ్యలో నీకేంటి సమస్య? అని అంటున్నారు.

Advertisement

Next Story