రూ.8 కోట్లు నష్టపోయామంటూ.. Vijay Devarakonda పై ఆ నిర్మాణ సంస్థ ట్వీట్‌

by Prasanna |   ( Updated:2023-09-06 07:18:55.0  )
రూ.8 కోట్లు నష్టపోయామంటూ.. Vijay Devarakonda పై ఆ నిర్మాణ సంస్థ ట్వీట్‌
X

దిశ,వెబ్ డెస్క్: 'ఖుషి' సినిమా హిట్ అవ్వడంతో విజయ్ దేవరకొండ ఆనందానికి అవధులు లేవు. ఈ సంతోషాన్ని తన అభిమానులతో పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. 'ఖుషి' సినిమా సంపాదనలోంచి రూ. కోటిని తన అభిమానులకు ఇస్తానని యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ప్రకటించాడు.విజయ్‌ది గొప్ప మనసు అంటూ నెటిజన్స్‌ ఆయన్ను ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' సినిమాను పంపిణీ చేసి రూ. 8 కోట్లు నష్టపోయామని, మాకు కూడా సాయం అందించాలంటూ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ అభిషేక్‌ పిక్చర్స్‌ ట్వీట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

''డియర్‌ విజయ్‌ దేవరకొండ! వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమా పంపిణీలో రూ.8 కోట్లు నష్టపోయాం. ఇంత వరకు దానిపై ఎవరూ స్పందించలేదు. మీ గొప్ప మనసుతో రూ. కోటిని పలు కుటుంబాలకు సాయం చేయనున్నారు. మా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలకు కూడా సాయం చేసి ఆదుకుంటారని ఆశిస్తున్నాం '' అని ట్వీట్‌లో పేర్కొంది.మరి ఈ ట్వీట్ పై విజయ్ స్పందిస్తాడో? లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి: రూ. 7 కోట్ల ప్రశ్న.. సమాధానమేంటో మీకు తెలుసా..?

Advertisement

Next Story