సినిమా ప్రమోషన్స్ కోసం స్టార్ హీరోయిన్‌ను చంపేసిన నిర్మాత..!

by Anjali |
సినిమా ప్రమోషన్స్ కోసం స్టార్ హీరోయిన్‌ను చంపేసిన నిర్మాత..!
X

దిశ, సినిమా: సర్వైకల్ క్యాన్సర్‌తో ప్రముఖ మోడల్, బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే మరణించిందన్న వార్త సోషల్ మీడియాలో ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తర్వాత స్వయంగా పూనమ్ పాండే నేను చనిపోలేదు బతికే ఉన్నానని.. గర్భాశయ క్యాన్సర్ గురించి మహిళలకు అవైర్‌నెస్ తెప్పించడానికి ఇలా చేశానని ఓ వీడియో ద్వారా తెలిపింది. దీంతో సోషల్ మీడియాలోని నెటిజన్లు దారుణంగా మండిపడ్డారు.

ఈ వార్త కాస్త నెట్టింట రచ్చకు దారి తీయడంతో పూనమ్ పాండే కంటే ముందే ఓ నిర్మాత సినిమా కోసం ఓ హీరోయిన్ చనిపోయినట్టు ప్రచారం చేసిన సంఘటనను జనాలు గుర్తుచేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియా భట్ తండ్రి మహేష్ భట్ తెలుగులో సూపర్ హిట్ అయిన క్రిమినల్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పబ్లిసిటీ చేయడం కోసం ఇందులో హీరోయిన్ గా నటించిన మనిషా కొయిరాలా మరణించినట్లు పేపర్‌లో ప్రింట్ వేయించాడు.

ఇక నిజంగానే తను చనిపోయిందని ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత అలియా తండ్రి.. కేవలం ప్రమోషన్స్ కోసమే హీరోయిన్ మరణించిందని చెప్పాం. తను బతికే ఉందని అసలు నిజం చెప్పడంతో నిర్మాత మహేష్ భట్ పై మనిషా అభిమానులు దారుణంగా మండిపడ్డారు. అమెరికన్ సినిమా ఫ్యూగిటీన్ మూవీ ప్రొడ్యూసర్లు సినిమా ప్రమోషన్లు కోసం ఇలాగే చేశారు. నేను కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని దాన్నే ఫాలో అయ్యాను. అంటూ మహేష్ భట్ చెప్పారట. పూనమ్ పాండే విషయంలో కూడా ఇలాగే జరగడంతో ప్రస్తుతం మనిషా కొయిరాలాను ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటూ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.



Advertisement

Next Story

Most Viewed