Rajini Kanth కి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన ఆ నిర్మాత..

by Shiva |   ( Updated:2023-09-01 14:56:23.0  )
Rajini Kanth కి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన ఆ నిర్మాత..
X

దిశ, వెబ్ డెస్క్ : రజనీకాంత్.. దేశం నలుమూలల ఆయనను ఆరాధించే అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. ఆయన సినిమా విడుదలైతే తమిళనాట పూనకాలే. కలెక్షన్లు మాట అటుంచితే బాస్ సినిమా రిలీజ్ అవుతుందంటూ ప్రతి ఒక్కరూ పండగ చేసుకుంటారు. తాజాగా, ఆయన నటించిన చిత్రం 'జైలర్' ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఫుల్ జోష్ లో ఉన్న 'జైలర్' చిత్ర నిర్మాత సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ రజనీకాంత్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తక్కువ బడ్జెట్ తో తీసిన మూవీకి ఊహించని విధంగా లాభాలు రావడంతో రూ.1.24 కోట్ల విలువ చేస్తే బీఎండబ్ల్యూ కారును రజనీకి బహుమతిగా అందజేశారు.

ఇవి కూడా చదవండి : Salaar మూవీ వాయిదా.. ఆ డేట్ ఫిక్స్..!

Advertisement

Next Story