నేషనల్‌ వైడ్‌గా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోన్న ‘బేబీ’ చిత్రం పోస్టర్

by Anjali |   ( Updated:2023-06-30 04:53:17.0  )
నేషనల్‌ వైడ్‌గా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోన్న ‘బేబీ’ చిత్రం పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ బేబీ’. వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రసాద్ ఐమాక్స్ వద్ద 70 అడుగుల పోస్టర్‌తో గురువారం చిత్ర బృందం అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ హనీ కిల్లర్ తరహాలో ఉంది. హీరోయిన్ నోట్లో బ్లేడ్ పెట్టుకుని, హీరో నోట్లో ఆ బ్లేడ్‌ను పెడుతున్నట్లుగా టూ మచ్ స్పైసీగా ఉంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి వీడియో గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచే ప్రేక్షకులందరూ ఈ మూవీపై అంచనాలు పెంచేసుకున్నారు. ఇప్పుడు బ్లేడ్‌తో లిప్ కిస్సులతో కూడిన ఈ పోస్టర్ చూశాక నేషనల్ వైడ్‌గా ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమా జులై 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Also Read: కమెడియన్ యోగిబాబు ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది!

Advertisement

Next Story