ఆసక్తి రేకెత్తిస్తున్న పొలిమేర-2 పోస్టర్

by Anjali |   ( Updated:2023-05-07 14:49:18.0  )
ఆసక్తి రేకెత్తిస్తున్న పొలిమేర-2 పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ పొలిమేర సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో చిత్రబృందం దీనికి సీక్వెల్ చేసింది. ఈ సినిమాను త్వరగా థియేటర్లలోనే విడుదల చేయాలని అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో చిత్ర బృందం స్పందించింది. ప్రేక్షకులు ఆశించిన విధంగానే ఈ చిత్రం అతి త్వరలో థియేటర్లలో విడుదల చేస్తామని చిత్ర కథానాయకుడు రాజేశ్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అభిమానులు మరింత ఆనంద పడేలా చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురుచూస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సత్యం రాజేశ్, బాలాదిత్య కీలక పాత్రలో నటించారు.

Also Read..

రెండో రోజూ సెన్సేషనల్ గ్రాస్ రాబట్టిన ‘ది కేరళ స్టోరీ’

Advertisement

Next Story