అలా బ్రతకడం తెలిసిన ఏకైక జీవి.. దర్శకుడు ఆర్జీవీ : కోన వెంకట్

by Kavitha |   ( Updated:2024-03-05 10:01:59.0  )
అలా బ్రతకడం తెలిసిన ఏకైక జీవి.. దర్శకుడు ఆర్జీవీ : కోన వెంకట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ లో రచయిత .. నిర్మాత అయిన కోన వెంకట్ గురించి తెలిసిందే. ఆయన కథ - స్క్రీన్ ప్లే నిర్మాతగా వ్యవహరించిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కెరీర్ ఆరంభంలో వర్మ సినిమాలకి కోన వెంకట్ కూడా పని చేశారు. అయితే తాజాగా తన కొత్త చిత్రం ప్రమోషన్ లో భాగంగా. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకట్ .. దర్శకుడు వర్మ గురించి మాట్లాడారు.. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.. ‘ కొన్నేళ్ల పాటు సంసారం చేసిన తర్వాత, జీవితం పట్ల వైరాగ్యంతో సన్యాసం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వర్మ ఒక దర్శకుడిగా తానేమిటో ఈ ప్రపంచానికి చూపించాడు.. డబ్బు .. కీర్తి ప్రతిష్టలు లైఫ్ లో అన్ని చూసేశాడు. ఇప్పుడు ఆయన చేసిన సినిమాలు చూస్తుంటే సినిమాల పట్ల ఆయన వైరాగ్యంతో ఉన్నాడేమోనని అనిపిస్తుంది.

వర్మ ముందు నుంచి కూడా తాను చేస్తున్నది తప్పని ఎప్పుడూ అనుకోడు. ఎవరైనా చెప్పినా వినిపించుకోడు.. అసలు చెప్పింది వినిపించుకోనివాడిపేరే వర్మ. పదిమందికి నచ్చే సినిమా కాదు .. నాకు నచ్చిన సినిమా తీస్తాను .. నచ్చితే చూడండి .. లేకపోతే లేదు అనే ఒక ఫిలాసఫీ ఆయనది. తనకు నచ్చినట్టు బ్రతకడం తెలిసిన ఏకైక జీవి ... ఆర్జీవీ’ అని తెలిపారు వెంకట్. ప్రజంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More..

నా భర్త ఆ పని చేయడం కోసం చింపాంజీలా ఎదురుచూస్తానంటూ అనసూయ ఆసక్తికర పోస్ట్

Advertisement

Next Story