‘సలార్’ అట్టర్ ఫ్లాప్.. ప్రభాస్‌కు అసలు యాక్టింగే రాదు.. హాట్ టాపిక్‌గా మారిన తాగుబోతు రివ్యూ (వీడియో)

by sudharani |   ( Updated:2023-12-23 15:15:54.0  )
‘సలార్’ అట్టర్ ఫ్లాప్.. ప్రభాస్‌కు అసలు యాక్టింగే రాదు.. హాట్ టాపిక్‌గా మారిన తాగుబోతు రివ్యూ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘సలార్’. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 175 కోట్లు వసూళ్లు రాబట్టి రికార్డులు బద్దలు కొడుతోంది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘సలార్’ పేరే వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో ‘సలార్’ సినిమాపై ఓ తాగుబోతు ఇచ్చిన రివ్యూ డార్లింగ్ అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తుంది.

ఈ మేరకు ‘సలార్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. మొదటి షో చూసి వాళ్ల ఫ్యాన్సే తిట్టుకుంటూ బయటకు వస్తున్నారు. అన్ని కలెక్షన్లు రావడానికి కారణం.. టికెట్లు రేట్లు పెంచారు. అందుకే అన్ని కోట్లు వసూళ్లు చేస్తుంది. అయినా.. ఈ సినిమానే కాదు. ప్రభాస్ ఇంకో 100 సినిమాలు చేసిన అవి సక్సెస్ కావు. ఎందుకంటే ఆయనకు యాక్టింగ్ రాదు. డైరెక్టర్లు ఆయన కటౌట్‌ను వాడుకుంటున్నారు.. అది కూడా 75% డూపే ఉంటుంది’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అంతే కాకుండా నీ అడ్రస్ పెట్టురా నీకు ఉంది అంటూ నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

Read More..

Prabhas : మాట వరసకు అంటే రూ. 6 కోట్ల కారు ఇచ్చేసిన రెబల్ స్టార్ ..

Advertisement

Next Story