‘SSMB-29’ సినిమాకు అతనికి సంబంధం లేదంటూ.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ట్వీట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-05-18 12:02:41.0  )
‘SSMB-29’ సినిమాకు అతనికి సంబంధం లేదంటూ.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషనల్‌లో ‘ఎస్‌ఎస్‌ఎంబీ-29’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయని తెలుస్తోంది. దీనిని శ్రీ దుర్గ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తోంది. అయితే మహేష్ బాబు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నట్లు టాక్. కొన్ని రోజుల నుంచి బయటకు రాకుండా తన లుక్‌ను సీక్రెట్‌గా ఉంచుతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఎస్‌ఎస్‌ఎంబీ-29 నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

అయినప్పటికీ ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. గత కొద్ది రోజుల నుంచి రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఎస్‌ఎస్‌ఎంబీ-29 సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్ విరేన్ స్వామి వర్క్ చేస్తున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం కాస్త మేకర్స్ వరకు వెళ్లడంతో వారు క్లారిటీ ఇస్తూ ఓ పోస్ట్ పెట్టారు. రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం కాస్టింగ్ డైరెక్టర్‌గా విరేన్ స్వామి పని చేస్తున్నాడని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

ఓ ప్రముఖ చానల్ కథనాన్ని ప్రచురించారు. అది మా దృష్టికి రావడం వల్ల మేము క్లారిటీ ఇవ్వడానికే ఈ లేఖను విడుదల చేశాము. వీరేన్ స్వామి మా సినిమాలో ఏ విధంగానూ భాగం కాలేదు. అయితే అవసరమైనప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను అధికారిక ప్రకటన ద్వారా నిర్మాణ సంస్థ తెలుపుతుంది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ కావడంతో అది చూసిన వారంతా.. మహేష్ బాబుకు సంబంధించినది ఏదైనా పోస్టర్ అయినా వదలమని వేడుకుంటున్నారు.

Advertisement

Next Story