ప్రభాస్ ‘సలార్’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ చేసిన మేకర్స్.. పోస్ట్ వైరల్!

by Hamsa |   ( Updated:2023-11-11 11:00:09.0  )
ప్రభాస్ ‘సలార్’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ చేసిన మేకర్స్.. పోస్ట్ వైరల్!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘సలార్’ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో శృతి హీసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా కోసం అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సలార్ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేశాయి. ఎన్నో వాయిదాల తర్వాత డిసెంబర్ 22న విడుదల కాబోతుందని సమాచారం. దీంతో ఫ్యాన్స్ ట్రైలర్ విడుదల చేయమని సోషల్ మీడియాలో రచ్చ మొదలెట్టారు. తాజాగా, ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న మేకర్స్ అప్టేట్ వదిలారు. ‘‘ట్రైలర్ అనౌన్స్‌మెంట్ తొందరలో ఉంది’’ అని రాసుకొచ్చారు. అలాగే ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అందులో విడుదల తేదీ ఏం మారకపోవడంతో ప్రేక్షకుల డిసెంబర్ 22 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story