Pushpa 2: The Rule: రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

by sudharani |   ( Updated:2024-01-26 15:23:54.0  )
Pushpa 2: The Rule:  రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘పుష్ప: ది రూల్’. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ 2021 డిసెంబర్ 17న రిలీజై సూపర్ సక్సెస్ అందుకోవడంతో.. ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా చిత్రీకరిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ పుష్ప పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. 2024 ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కానీ, అనుకోని విధంగా ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్ట్ కావడంతో అనుకున్న సమయంలో మూవీ విడుదల కాకపోవచ్చనే వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి. దీనిపై తాజాగా చిత్ర బృందం స్పందించింది. ‘పుష్ప 2 రిలీజ్ పోస్ట్ పోన్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ముందుగా ప్రకటించిన తేదీలోనే అంటే.. 2024 ఆగస్టు 15న పుష్ప గాడు థీయేటర్‌లో కనిపిస్తాడని’ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Advertisement

Next Story