Japan : 'జపాన్' చివరి షెడ్యూల్ ఆరంభం అప్పుడే..?

by Shiva |   ( Updated:2023-05-30 14:34:43.0  )
Japan : జపాన్ చివరి షెడ్యూల్ ఆరంభం అప్పుడే..?
X

దిశ, వెబ్ డెస్క్ : వినూత్న కథాంశాలు ఎంచుకునే తమిళ హీరో కార్తీ, దర్శకుడు రాజు మురుగన్ కాంబినేషన్ లో వస్తున్న మూవీకి 'జపాన్' అనే టైటిల్ ను మూవీ మేకర్స్ లాక్ చేశారు. తాజా అప్‌డేట్ ప్రకారం.. ఈ సినిమా యొక్క చివరి షెడ్యూల్ జూన్ 2, 2023 నుంచి తమిళనాడులోని EVP ఫిల్మ్ సిటీలో కొనసాగనుంది. నెల రోజుల పాటు షెడ్యూల్ కొనసాగుతుందని సమాచారం. షెడ్యూల్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయని మూవీ మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. టాలీవుడ్ పాపులర్ కమెడియన్ సునీల్, విజయ్ మిల్టన్ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సినిమాను నిర్మిస్తుండగా.. జీ.వీ. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

Read More... చాలా రోజుల తర్వాత థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేశా ‘మేము ఫేమస్’ సినిమాపై రాజమౌళి పోస్ట్

ఓంకార్ షోలో నటుడు జేడీ చక్రవర్తి బోల్డ్ స్టేట్‌మెంట్.. షాక్‌లో హీరోయిన్లు!

Advertisement

Next Story