యాదాద్రిలో రౌడీ హీరోకు షాకిచ్చిన లేడీఫ్యాన్.. ఏం చేసిందంటే?

by Anjali |   ( Updated:2023-09-03 12:07:16.0  )
యాదాద్రిలో రౌడీ హీరోకు షాకిచ్చిన లేడీఫ్యాన్.. ఏం చేసిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ బృందం.. కుటుంబ సభ్యులతో కలిసి టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేడు(ఆదివారం) యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. కాగా ఈ క్రమంలో ‘ఖుషి’ టీమ్‌ను చూడడానికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే కారు దిగిన తర్వాత విజయ్ తన బ్రదర్ ఆనంద్ దేవరకొండ తల్లితో కలిసి సినీ బృందంతో గుడి వైపు వెళుతున్న సమయంలో విజయ్‌తో సెల్ఫీ దిగేందుకు ఒక అమ్మాయి ప్రయత్నిస్తూ గుంపులో దూరి ఒక్కసారిగా వెళ్లి రౌడీ హీరోను హగ్ చేసుకున్నట్లుగా గట్టిగా పట్టుకుంది. ఒక్కసారిగా ఆ అమ్మాయి చేసిన పనికి విజయ్ షాక్ అయ్యాడు. వెంటనే ఆయన పక్కనే ఉన్న సిబ్బంది అలర్ట్ అయ్యి.. ఆమెను పక్కకు లాగే ప్రయత్నం చేయగా.. విజయ్ వారిని వద్దని ఆపి.. ఆమెతో ఫోటో దిగి పంపించాడు. ‘‘విజయ్ దేవరకొండకు ఎంతలా క్రేజ్ ఉందో చూశారా? గుడిలో కూడా అమ్మాయిలు ఆయన వెంట పడుతున్నారు, వామ్మో ఇలా ఉన్నారేంటి?’’ అంటూ రౌడీ హీరో అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story