- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీనే ‘కిల్లర్ సూప్’.. ఇంట్రెస్టింగ్ స్టోరీ!
దిశ, సినిమా: అభిషేక్ చౌబే దర్శకత్వంలో.. మనోజ్ భాజ్ పాయ్-కొంకణీ సేన్ వర్మ జంటగా ‘కిల్లర్ సూప్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిన విషయం తెలిసిందే. హర్షన్ నలవాడే, అనంత్ త్రిపాఠి అండ్ ఉనైజా మర్చంట్‌తో కలిసి అభిషేక్ చౌబే నిర్మించిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ కథ 2017 లో తెలంగాణలో జరిగిన ఓ కేసు ఆధారంగా రూపొందించారట.
నాగర్ కర్నూల్ పట్టణంలో బాయ్‌ఫ్రెండ్ సహాయంతో స్వాతి రెడ్డి తన భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. భర్త ఫేస్‌ను ప్రియుడు రాజేష్‌కు పెట్టాలని స్వాతి రెడ్డి తన ప్రియుడిపై యాసిడ్ పోసింది. యాసిడ్ దాడి తర్వాత తమ కొడుకే హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడని అత్త మామలను నమ్మించింది. ఈ క్రమంలో మటన్ తింటే కాలిన గాయాలు తొందరగా నయమవుతాయని సుధాకర్ తల్లి మటన్ వండుకొచ్చి అతడికి పెట్టగా మటన్ తినడానికి తిరస్కరించాడు.
ఎందుకంటే రాజేష్ పూర్తి వెజిటేరియన్. నాన్ వెజ్ ఎంతో ఇష్టంగా తినే సుధాకర్ రెడ్డి మటన్ తినడానికి తిరస్కరించడంతో తల్లిదండ్రులకు డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో అసలు విషయం బయటపడింది. విచారణ చేపట్టిన పోలీసులు స్వాతి రెడ్డిని అరెస్టు చేశారు. ఈ స్టోరీ ఆధారంగానే కిల్లర్ సూప్ సిరీస్ తీశారు. ఈ వెబ్ సిరీస్‌లో స్వాతి రెడ్డిని కొంకణా సేన్ పాత్రలో.. సుధాకర్ అండ్ రాజేష్ పాత్రలో మనోజ్‌ను రెండు పాత్రల్లో చూపించారు.